Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దిల్లీ: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్‌, వినోద్‌ కుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. మూడో రోజు దిల్లీ పర్యటనలో భాగంగా గడ్కరీని కలిసిన కేసీఆర్‌ సుమారు గంటకుపైగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు మంజూరుకు అనుమతులతో పాటు, రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో పురోగతి వంటి అంశాలపై మంత్రితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో రహదారులు, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపైనా చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో దానికి కృతజ్ఞత తెలపడంతో పాటు జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరానికి గ్రాంట్‌గా రూ.25వేల కోట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గడ్కరీతో భేటీ అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు పయనం కానున్నారు.