Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటించేస్తాయి. కొన్ని చోట్ల ముందుగానే కొన్ని అందజేసేందుకు ప్రయత్నిస్తూ కూడా ఉంటాయి. అయితే ఈసారి తొలిసారిగా ఓటు వేయబోయే 18 ఏళ్లు నిండిన నూతన ఓటరులందరికీ ఎన్నికల సంఘం అధికారులు కూడా ఒక కొత్త తరహా కానుకని అందించబోతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వజ్రాయుధంలాంటి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించే సమాచారంతో కూడిన క్యాలెండర్లను కొత్త ఓటర్లకు అందించడం ద్వారా వారిలో అవగాహన పెంపొందించే దిశగా తొలి అడుగు వేయనున్నారు.

ప్రత్యేక ప్యాకింగ్‌తో ముస్తాబు చేయబడిన ఈ క్యాలెండర్లపై కొత్త ఓటర్ల చిరునామాలు కూడా అతికించి, ప్రస్తుతం వీటిని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచారు. పోలింగ్‌ బూత్‌స్థాయిల్లో ఉండే అధికారుల ద్వారా త్వరలో వీటిని అందజేయనున్నారు. ఓటు హక్కు వినియోగంపై యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.