Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె రాకతో కాంగ్రెస్ మరిన్ని కుంభకోణాలకు పాల్పడుతుందన్నారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని కొంటాయ్‌లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో వంశపారంపర్య నాయకత్వాంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 2జీ నుంచి 3జీ అయిందన్నారు.

రాహుల్ గాంధీ ఇక్కడికి (పశ్చిమ బెంగాల్‌కు) తరచూ వస్తున్నారన్నారు. సోనియా, మన్మోహన్ ప్రభుత్వం ఉన్న పదేళ్ళలో 2జీ ఉండేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉండేవారని, అంటే 2జీ అని, ఆ సమయంలో రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ వచ్చారని, ఇక 3జీలు ఉంటే, అవినీతి, కుంభకోణాలు ఎంత విలువైనవి పునరావృతమవుతాయోనన్నారు. ఇద్దరు జీల నుంచి ముగ్గురు జీలతో మరిన్ని కుంభకోణాలు చేయాలనే ప్రణాళికతో కాంగ్రెస్ వచ్చిందన్నారు.