Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అలా దేశం కోసం పని చేసి ప్రస్తుతం దుర్భర జీవనం గడుపుతున్న విశ్రాంత సైనికులు, వితంతువులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ మహిళ డాక్టర్‌ ముందుకు వచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. ముగ్గురు సైనికులకు జీవితకాలం నెలకు రూ.2 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. సోమవారం సోమాజిగూడలోని సైనిక్‌ ఆరంఘర్‌లో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనే్‌షకుమార్‌తో కలిసి మొదట ఒక్కొక్కరికి రూ.5 వేలు చెల్లించింది. ఈ సందర్భంగా శ్రీనేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఒకరోజు తనకు ఒక నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చిందన్నారు. తనను డాక్టర్‌గా పరిచయం చేసుకుని మనసులో ఉన్న మాటను చెప్పారన్నారు. దేశం కోసం పని చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సైనికులకు ఆసరాగా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని వసంత చెప్పారన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పాలెం వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న వసంత సైన్యంలో పని చేస్తున్న ఓ సైనికుడి కుమార్తె ద్వారా తన నెంబర్‌ తెలుసుకుని సంప్రదించారన్నారు. ఆమె గొప్ప మనసుతో ముగ్గురు ఆర్థికంగా లబ్ధిపొందడం ఆనందంగా ఉందన్నారు. వీరిలో సిపాయి సోమయ్య, అమర జవానులు మల్లేష్‌ సతీమణి గంగామణి, దేవదానం సతీమణి విక్టోరియా ఉన్నారు. వీరికి ఎలాంటి పెన్షన్‌ రావడం లేదు. వారిని ఆదుకోవడంపై మిగిలిన సైనికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్మీ కోసం అందరూ ముందుకు రావాలి..
ఇండియన్‌ ఆర్మీని పటిష్ఠం చేసేందుకు ప్రతీ ఒక్కరు ముందుకురావాలి. ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌కు ఎవరైనా నగదు జమ చేయవచ్చని తెలిసింది. ఆరు నెలలుగా సిండికేట్‌ బ్యాంకులో ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌ ఖాతాలో నగదు జమ చేస్తున్న. ఈ అకౌంట్‌లో ఒక్క రూపాయి నుంచి ఎంత డబ్బైనా జమ చేసే వెసులుబాటు ఉంది. ఇందులో జమ అయిన డబ్బులను ఆర్మీ యుద్ధ విమానాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, అధునాతన ఆయుధాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాలో సగం మంది ముందుకు వచ్చినా భారత్‌ శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. అంతేకాకుండా సైన్యంలో పని చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకుంటే దేశానికి సేవ చేసినట్టే. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా.