Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ రక్షణ కోసం నిరంతరం పహార కాస్తున్న సైనికులకు మెరుగైన వసతులు, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించే వెపన్స్‌ కావాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రభుత్వం రక్షణ శాఖ కోసం అధికంగానే నిధులు వెచ్చిస్తున్నా.. చాలడం లేదు. ఇంకా నిధులు కావాలంటే ఏం చేయాలి.. దేశం కోసం మనం ఓ చేయి కలుపుదాం.. కానీ ఎలా.. అని ఆలోచించి ఓ సంస్థను ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన రాజేందర్‌ గుప్తా. కనీసం ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి కేటాయించినా కోట్లు సమకూరుతాయని భావించారు.
అయితే సంస్థలో ఉన్న వారు అవినీతి పాల్పడే అవకాశం లేకపోలేదు, ప్రజలు అనుమానించే ఆస్కారం కూడా ఉండడంతో తన మనసులోని ఆలోచనలతో 2017 జూలై 19న ప్రధాన మంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి, రక్షణశాఖల మంత్రుల కార్యాలయాలకు లేఖలు రాశారు గుప్తా. దీన్ని పరిశీలించిన ఆయా శాఖలు ఆలోచన బాగుందని అధికారికంగా ఓ బ్యాంక్‌లో అకౌంట్‌ తీశారు. ఈ విషయాన్ని రక్షణశాఖ కార్యాలయం నుంచి ఆ వ్యక్తికి తెలిపారు. తన కల నేరవేరిందని గుప్తా ఎంతో సంబరపడ్డారు. తొలుత తన వంతు సహాయంగా రూ.5001 అకౌంట్లో జమ చేశారు. అంతే కాకుండా సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నగర యువత చేయుత
ఆర్మీ సంక్షేమం కోసం గుప్తా చేస్తున్న కృషికి నగర యువత కూడా సహాయం చేస్తున్నారు. ఆర్మీ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఆ ఖాతాలో డబ్బు జమ చేస్తున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. దేశ సేవ చేసేందుకు ఇలాగైనా అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు, షికార్లు, సోషల్‌ మీడియాలో చాటింగ్‌లతో బిజీగా ఉంటూ దేశం కోసం యువతీయువకులు ఆలోచించరని చాలా మంది అపోహ పడుతుంటారు. అలాంటి వారి సమాధానంగా దేశం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు చాలా మంది