Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మీడియం దగ్గర నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకూ ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. వీటి రేట్లు కూడా సామాన్యులు బాబోయ్‌ అనేటట్లు ఉంటాయి! ఈ లిస్ట్‌లో జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌, ఉదయ్‌పూర్‌లోని తాజ్‌ లేక్‌ ప్యాలె్‌సలు అన్నింటికన్నా ముందు వరసలో ఉన్నాయి.
సాధారణంగానే ఇలాంటి రాజభవనాల్లాంటి హోటల్స్‌లోకి అడుగుపెట్టాలంటే సామాన్యుల తరం కాదు. ఒక రాత్రి బస చేయాలంటే కనీసం 30 వేలు చెల్లించాలి. ఇక ప్రత్యేకమైన సూట్‌ రూమ్‌ కావాలంటే 80 వేల రూపాయలు విదిలించాల్సిందే. మరి ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి 2019 జనవరి 1 వరకు ఈ హై రేంజ్‌ హోటళ్లలో ఉండటానికి ఏకంగా 11 లక్షలు వసూలు చేస్తున్నారు. గత ఏడాది తాజ్‌ రాంబాగ్‌ ప్యాలెస్‌ ఏకంగా 8 లక్షల రూపాయలను చార్జీ చేసింది. సాధారణ రోజుల్లో వసూలు చేసే మొత్తం కన్నా తాజాగా వసూలు చేస్తున్న రుసుము 40 శాతం ఎక్కువట. అయినా సరే, కొత్త సంవత్సరాన్ని విలాసంగా స్వాగతిద్దామనుకునేవారు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ హోటళ్లలో బుకింగ్‌లు దాదాపు పూర్తయిపోయాయట!