Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

స్విట్జర్లాండ్‌ : ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహిత కోఫీ అన్నన్‌(80) శనివారం మృతి చెందారు. స్వల్ప అస్వస్థతో బాధపడుగున్న కోఫీ అన్నన్‌ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఐరాస సెక్రటరీ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. 1997నుంచి 2006 వరకూ రెండు దఫాలుగా కోఫీ ఐరాస సెక్రటరీ బాధ్యతలు నిర్వహించారు.

1938లో అఫ్రికాలోని కుమాసి నగరంలో కోఫి అన్నన్‌ జన్మించారు.ఆయన పూర్తిపేరు కోఫి అటా అన్నన్‌. అమెరికాలోని మాకాలెస్టర్‌ కాలేజీలో చదువుకున్నారు.ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో బడ్జెట్‌ ఆపీసర్‌గా కెరీర్‌ మొదలు కోఫి అన్నన్‌..1997లో ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విజృంభిస్తున్న రోజుల్లో అన్నన్ ఐరాస చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.