Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ముంబయి: జాతీయ పెట్టుబడి, మౌలిక నిధి (ఎన్‌ఐఐఎఫ్‌)లో అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ టెమాసెక్‌ 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2800 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఎన్‌ఐఐఎఫ్‌ మాస్టర్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టిన ఏడో సంస్థగా నిలవనుంది. ఇప్పటివరకు ఎన్‌ఐఐఎఫ్‌లో మన ప్రభుత్వం, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారటీ, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఎన్‌ఐఐఎఫ్‌లో టెమాసెక్‌ పెట్టుబడులు పెట్టడంపై ఎన్‌ఐఐఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సుజయ్‌ బోస్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త మౌలిక ప్రాజెక్టులు లేదా ఆగిపోయిన వాటికి తోడ్పాటు అందించడానికి పెట్టుబడి సంస్థగా ఎన్‌ఐఐఎఫ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఐఎఫ్‌లో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండగా, అంతర్జాతీయ, దేశీయ మదుపర్లకు మిగిలిన వాటా ఉంది. ప్రస్తుతం ఎన్‌ఐఐఎఫ్‌ రెండు ఫండ్లు మాస్టర్‌ ఫండ్‌, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ నిర్వహిస్తోంది. మూడో ఫండ్‌గా స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ మూడు ఫండ్‌ల కోసం రూ.40000 కోట్లు సమీకరించేందుకు ఎన్‌ఐఐఎఫ్‌ సన్నాహాలు చేస్తుందని, ఇందులో రూ.20000 కోట్లు ప్రభుత్వం నుంచి సమీకరించనున్నామని బోస్‌ అన్నారు.