Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తెలుసు. దాంతోపాటు చిత్తవైకల్యం ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఇది అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తల మాట. ఉప్పు ఎక్కువగా తింటే మెదడుకు రక్త సరఫరా తగ్గి జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అంతేకాకుండా, తాజా పరిశోధనతో ఆంత్రానికి, మెదడుకు ఉన్న సంబంధం తొలిసారి తేలిందని వివరించారు. రోజుకు 2,300 మిల్లీగ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు.