Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉద్యోగాల కోసం వెతికే నిరుద్యోగులకు తనవంతు సాయం అందించేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ముందుకొచ్చింది. దీనికోసం ఓ నూతన అప్‌డేట్‌ను తీసుకురానుంది. దీనిలో భాగంగా ఫలానా ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయి, ఆ ఉద్యోగాన్ని పొందడానికి చేయాల్సిన విధులపై పూర్తిస్థాయి సమాచారాన్ని నిరుద్యోగులకు అందించేలా ఇది ఉండనుంది.

అలాగే గూగుల్‌ తన సెర్చ్‌ ఇంజిన్‌కు సరికొత్త హంగులు అద్దేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సెర్చ్‌ ఇంజిన్‌కు ఊహా శక్తిని అందించాలని నిర్ణయించినట్లు గూగుల్‌ సంస్థ ప్రకటించింది. గూగుల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను మరింత అందంగా తీర్చిదిద్దనుంది. దీనికోసం కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్‌లను ఉపయోగించనున్నట్లు సెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బెన్‌ గోమ్స్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.