Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆకలి మీద ఉన్నారు. వేడివేడిగా అన్నం, ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర ఇవన్నీ మనసులో ఊరిస్తూ ఉంటాయి. కానీ ఇంటికెళితే డైనింగ్‌ టేబుల్‌ మీద పచ్చి వంకాయలు దర్శనమిస్తే… ఇక షేక్‌ అయిపోవడం ఖాయం. అయితే కష్టమైనా సరే పచ్చి కూరగాయలే బెటర్‌ అన్నది ‘పచ్చి’ నిజం.

పోషకాలు మాయం!
  • మార్కెట్లో కూరగాయలు కొనగానే వేడి వేడి నూనెలో కారం, ఉప్పు, మసాలా దట్టించి వేయించడం అప్పుడప్పుడు మానేయాలని నిపుణులు అంటున్నారు.
  • కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే సి-విటమిన్‌, కీలకమైన ఎంజైమ్స్‌ ఆహారం అరుగుదలకు ఎంతో ఉపయోగపతాయి. అయితే కూరగాయలను వేడిచేస్తే ఇటువంటి పోషకాలు మాయమైపోతాయి.
స్టీమ్‌ చేసుకోండి
  • కూరగాయలను వేయించడం ఒక్కటే మార్గమా కాదు….ఇంకో దారి కూడా ఉంది. ఉడకబెట్టండి. అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతతో, నీళ్లతో కూరగాయలను చాలా లైట్‌ స్టీమ్‌లో వంట చేయాలి.
  • అలాగే కూరగాయలతో వంట చేశాక, మిగిలిన నీళ్లలో బోల్డెన్ని పోషకాలు ఉంటాయి. ఈ నీళ్లతో మాంసం సూప్‌ చేసుకోవచ్చు. అలాగే నూడుల్స్‌నూ వండుకోవచ్చు.
 క్యాన్సర్‌కు చెక్‌
  • పచ్చి ఆకుకూరల్లో మైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలైన కార్సినోజెన్స్‌కు ఈ ఎంజైమ్‌ చెక్‌ చెబుతుంది.
 మెదడుకు రక్ష!
  • టమాటాల్లో ఉండే లైకోపిన్‌ అనే పిగ్మెంట్‌ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండెను అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
  • వీటిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందడమే కాకుండా మెదడు, నాడీ వ్యవస్థలపై మంచి ప్రభావం చూపుతుంది.