Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా స్కాట్‌ మోరిసన్‌(50) ఎన్నికయ్యారు. తాజా మాజీ ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌(63) స్థానంలో లిబరల్‌(కన్సర్వేటివ్‌) పార్టీ తరఫున ఎన్నికైన అభ్యర్థిగా ఈ పదవిని చేపట్టనున్నారు. ప్రధాని అభ్యర్థి రేసులో పార్టీ తరఫున మోరిసన్‌, పీటర్‌ డటన్‌ నిలిచారు. దేశ కోశాధికారిగా పనిచేసిన మోరిసన్‌ 45 ఓట్లు సాధించగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన పీటర్‌ డటన్‌కు 40 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆస్ట్రేలియాలో పదేళ్లుగా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. దశాబ్దకాలంలో ఆరుగురు ప్రధానులు మారారు. 2007 తరువాత వరుసగా జరిగిన ఏ రెండు ఎన్నికలూ ఒకే ప్రధాని హయాంలో జరగకపోవడం గమనార్హం.