Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది.  దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటాయి. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.

ఇంకా కొన్ని ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే కిరణాలు మూలవిరాట్‌ దగ్గరకు వెళ్లలేవు. అంతేకాదు, స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు. ఒకపక్కగా నిలబడి నమస్కరించుకోవాలి.