Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని తాను ప్రయత్నిస్తుంటే తనను పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం కర్ణాటకలోని కలబురగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘నేను ఉగవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు నన్నే తొలగించాలని చూస్తున్నారు. 125 కోట్ల మంది ఆశీర్వదాలు ఉన్న మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఇండియాని ధైర్యవంతమైన దేశంగా చూస్తోంది. ఇది మోదీ గొప్పతనం కాదు, 125కోట్ల భారతీయుల గొప్పతనం’ అని మోదీ పేర్కొన్నారు. (పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని విరాళం)

ఆయన కాంగ్రెస్‌ చేతిలో కీలు బొమ్మ
కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రిమోట్ కంట్రోల్డ్‌ సీఎం అని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ చేతిలో కీలు బొమ్మలా మారాడని విమర్శించారు. దేశంలో బలమైన పార్టీ అధికారంలోకి రావాలని, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ రైతుల పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని.. ఆ తరువాత వారిని అవమానించడమే కాకుండా.. వారిపై కేసులు కూడా పెట్టిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశ పెడితే వ్యతిరేకిస్తున్నారని.. రైతుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారంటూ ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని చెప్పారు.