Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణకాండ సృష్టించారు. ఈ సాయుధ దాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు త్రుటిలో బయటపడింది. దుర్ఘటన జరిగిన ప్రదేశానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడమే వారి ప్రాణాలను కాపాడింది. ఈ దారుణం నేపథ్యంలో కివీస్‌ టూర్‌ను బంగ్లాదేశ్‌ రద్దు చేసుకుంది. మూడు టెస్టుల సిరీ్‌సలో భాగంగా ఆఖరి, మూడో టెస్టు శనివారం నుంచి జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్‌ జట్టులోని ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఆటగాళ్లంతా శుక్రవారం ప్రార్థనల కోసం.. కాల్పులు జరిగిన హగ్లే పార్క్‌ సమీపంలోని మస్జిద్‌ అల్‌ నూర్‌కు వెళ్లారు. కానీ, హఠాత్తుగా కాల్పుల కలకలం రేగడంతో క్రికెటర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సులోనే ఉండిపోయారు. అదృష్టవశాత్తూ బంగ్లా ఆటగాళ్లు, అధికారులకు ఎటువంటి గాయాలూ కాలేదు. ‘కాల్పులు జరిపిన ప్రదేశానికి కొంత దూరంగా ఉండడం అదృష్టం. కానీ, సినిమాల్లో చూసే భీతావహ దృశ్యాలు కళ్లముందే కనిపించాయి. మసీదు బయట రక్తపు మడుగుల్లో కొందరు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడడం చూశామ’ని బంగ్లా టీమ్‌ మేనేజర్‌ ఖాలిద్‌ మసూద్‌ తెలిపాడు. ‘కాల్పుల మోతతో దాదాపు పది నిమిషాలు బస్సులోనే కిందపడుకున్నాం. మాపై నేరుగా కాల్పులు జరిగి ఉంటే.. ఊహించడానికే భయంగా ఉంది’ అని అన్నాడు. దాడి సమయంలో బస్సులోనే ఉన్న బంగ్లాటీమ్‌ వీడియో అనలిస్ట్‌, ముంబైకి చెందిన శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ కూడా క్షేమంగా బయటపడ్డాడు. టీమ్‌ స్పిన్‌ కన్సల్టెంట్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషి మాత్రం హోటల్‌లోనే ఉండిపోయాడు. అయితే, ఈ టెస్టు రద్దుకు మద్దతిస్తున్నట్టు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పాడు.

ప్రెస్‌మీట్‌ ఆలస్యం కాకపోతే….?

బంగ్లాదేశ్‌ జట్టు కెప్టెన్‌ మహ్మదుల్లా ప్రెస్‌మీట్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే తాము బతికి పోయామని శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ చెప్పాడు. సమావేశం ముగిసి న తర్వాత జట్టు సభ్యులు, సహాయ సిబ్బందిలో కొందరు ప్రార్థనకు వెళ్లాలని నిర్ణయిం చుకున్నట్టు తెలిపాడు. ‘జట్టులోని కొందరు ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌కు దగ్గరలోని మసీదుకు నేను కూడా బయల్దేరా. మహ్మదుల్లా ప్రెస్‌మీట్‌ ఆలస్యం కాకపోతే మరో 5 నిమిషాలు ముందే బయల్దేరేవాళ్లం. అలా వెళ్లి ఉంటే కాల్పుల సమయంలో మసీదులో ఉండేవాళ్లం. మేం బస్సులో అక్కడికి వెళ్లగా.. చూస్తుండగానే ఓ మహిళ నడుచుకుంటూ వచ్చి పడిపోయింది. కళ్లుతిరిగి అలా పడిపోయిందేమోనని అను కున్నాం. ఆ వెంటనే కాల్పుల శబ్దం మొదలైంది. దీంతో బస్సు లోనే ఉండిపోయాం. దాదాపు 10 నిమిషాలపాటు విచక్షణా రహితంగా కాల్పులు జరిగా య’ని శ్రీనివాస్‌ చెప్పాడు. కాల్పుల సమయంలో నక్కి చూస్తే చుట్టూ రక్తసిక్తమైన భీతావహ వాతావరణం భయకంపితుల్ని చేసిందన్నాడు.