Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తాజ్‌మహల్‌…. ప్రపంచ వింతల్లో ఒకటి. ఎవరైనా కావచ్చు. ఒక్కసారైనా చూసి ఆస్వాదించాలనుకునేవారికి అపురూప చారిత్రక సాక్ష్యం. ఒకసారి తాజ్‌ను చూసినవాళ్లు చాలాసార్లు అక్కడికి వెళ్లాలనుకుంటారు. ఇప్పుడదే అపురూప కళాకృతికి కాలుష్యం కూడా రెట్టింపు కావడంతో చార్జీలు పెంచి జనాన్ని కట్టడి చేశారు పురావస్తు శాఖ అధికారులు. గతంలో తాజ్‌ను చూడటానికి ఒక్కొక్కరు 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు తాజ్‌కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు క్రమంగా అడ్డుకట్ట వేయడానికి టిక్కెట్‌ రేటును పెంచారు. అంటే ఈ సారి తాజ్‌ను చూడాలనుకుంటే భారతీయ పౌరులు ఒక్కొక్కరూ 250 రూపాయలు చెల్లించాల్సిందే.