Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబచ్చన్‌ కన్నడ పాట పాడారు. కన్నడ నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కన్నడ నటి పరూల్‌ యాదవ్‌ నటిస్తున్న బటర్‌ ఫ్లై సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఒక క్లబ్‌ సాంగ్‌ను అమితాబ్‌ బచ్చన్‌ చేత పాడించారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంతో మాస్టర్‌ హిరణ్ణ రాసిన ఈ పాటను రాశారు. గాయని విద్యా హోక్స్‌ కూడా అమితాబ్‌తో గొంతు కలిపారు. ఈ పాటను ప్యారిస్‌లో ఒక క్లబ్‌లో నాలుగురోజులు షూటింగ్‌చేసినట్లు చెబుతున్నారు. అమితాబ్‌ 14 ఏళ్ల కిందట అమృత దారే అనే కన్నడ సినిమాలో అతిథి పాత్రను పోషించారు. మళ్లీ ఇప్పుడు శాండల్‌వుడ్‌ తెరపై దర్శనమిస్తారు.