Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జకార్తా: ఇండోనేషియా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజధాని జకార్తాలోని గెలోరా బంగ్ కర్నో (జీబీకే) స్టేడియంలో వేడుకలను కళ్లు చెదిరేలా నిర్వహించారు. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ గాయకుల పాటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు, నృత్యాలు, డ్రామాలతో స్టేడియం హోరెత్తింది.

వివిధ దేశాలకు చెందిన మొత్తం 6 వేలమంది అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో క్రీడాకారిణి నీరజ్ చోప్రా త్రివర్ణ పతకాన్ని చేబూని ఆటగాళ్లతో కలిసి స్టేడియంలో ముందుకు సాగారు. 572 మంది ఆటగాళ్లతో కూడిన 804 మంది సభ్యుల భారత బృందం జకార్తాలో కాలుమోపింది. క్రీడల్లో మొత్తం 58 అంశాల్లో 45 దేశాలకు చెందిన 10 వేల మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.