Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉత్తరప్రదేశ్‌లోని ఖీరీ జిల్లాకు చెందిన చారిత్రక ప్రాంతం గోలా గోకర్ణనాథ్‌ను చిన్న కాశీగా పిలుస్తుంటారు. కాశీ తరువాత ఈ ప్రాంతంలో శివారాధన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రక వివరాల ప్రకారం లంకాధిపతి రావణుడు ఘోర తపస్సును ఆచరించి మహా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. తనతో పాటు వచ్చి లంకలో ఉండాలని శివుణ్ణి వేడుకున్నాడు. దీనికి పరమేశ్వరుడు సమ్మతి తెలిపాడు. అయితే తన ప్రతిరూపమైన శివలింగాన్ని దారిలో కింద ఎక్కడైనా పెడితే అక్కడే ఉండిపోతాననే షరతు విధించాడు. అయితే రావణుడు ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఏమరపాటుతో శివలింగాన్ని కింద పెట్టాడు. దీంతో మహా శివుడు అక్కడే స్థిరపడిపోయాడు. అయితే రావణుడు తిరిగి ఆ శివలింగాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ పురాణ గాథకు ప్రతిగా ఈ నాటికీ ఇక్కడి మహా శివలింగంపై రావణుని వేలి ముద్రలు దర్శనమిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా గోలా గోర్ణనాథ్‌లో ఘనంగా అభిషేకాలు నిర్వహిస్తుంటారు.