Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మంచే మాట్లాడు.. చెడు మాట్లాడారో తథాస్తు దేవతుంటారు జాగ్రత్త.. అంటూ పెద్దలు అంటూ వుంటారు. ఇంకా సంధ్యావేళలో జాగ్రత్త మాట్లాడాలని వారు సూచిస్తుంటారు. అయితే తథాస్తు దేవతల గురించి తెలుసుకోవాలా ఈ కథనం చదవండి. సాధారణంగా ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మన మనస్సు మంచినే ఆశిస్తే అదే జరుగుతుంది. కీడును తలిస్తే కీడే జరిగితీరుతుంది. ఇక్కట్లు పెరుగుతాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి. తథాస్తు దేవతలూ ఆశీర్వదిస్తారు.
 ఇక తథాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదని.. అలా అనుకుంటే దేవతలు తథాస్తు అని అంటారు. దీంతో జరగాల్సిందంతా జరిగిపోతుంది. అందుకే నెగటివ్‌గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ వుంటాయి.
ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు చెప్తూ వుంటే.. నిజంగానే లేకుండా పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ నటిస్తూ అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు. అందుకే మంచి గురించే ఆలోచించాలి. మంచే మాట్లాడాలి. ధర్మాన్నే ఆచరించాలి. అప్పుడు మనకు మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.