Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎమర్జెన్సీ కమిటీని ఎర్పాటు చేసిన దుబాయి రాజు

యూఏఈ/దుబాయి: ‘భారత్‌లోని కేరళ రాష్ట్రం భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు కేరళను ముంచెత్తాయి. వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. బక్రీద్ పండగ జరుపుకోవడం కంటే ముందుగా.. కేరళకు సాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆపదలో ఉన్న మన భారతీయ సోదరులకు అండగా ఉండటం మన బాధ్యత..’.. అంటూ దుబాయి రాజు, యూఏఈ ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి అయిన మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పిలుపునిచ్చారు. కేరళలోని ప్రస్తుత పరిస్థితికి అద్దంపట్టే, జలవిలయంలో చిక్కుకుపోయిన నిరాశ్రయులు, వరదల ధాటికి నేలమట్టమయిన ఇళ్ల ఫొటోలను జత చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

పెనువిపత్తులో చిక్కుకున్న కేరళకు సాయం చేసేందుకు ఓ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను దుబాయి రాజు మహ్మద్ బిన్ రషీద్ అదేశించారు. యూఏఈ, భారత ప్రజలంతా ఒక్కటై కేరళలోని వరద బాధితులకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరికి వారు తమకు చేతనయినంత సాయం చేయాలని కోరారు. ‘యూఏఈ అభివృద్ధిలో, మన విజయ ప్రస్థానంలో కేరళకు ప్రత్యేక స్థానం ఉంది. కేరళ మనలో ఒక భాగం..’ అని మహ్మద్ బిన్ రషీద్ వ్యాఖ్యానించారు. కాగా.. యూఏఈలో ఉన్న భారతీయుల్లో కేరళ రాష్ట్రం వారే ఎక్కువ. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు కేరళ నుంచి ఎక్కువ మంది వలస వెళ్తుంటారు. చాలా ఏళ్ల క్రితం నుంచే కేరళ నుంచి ఈ వలసలు ఉన్నాయి. కార్మికులుగా, వృత్తి నిపుణులుగా, ఇంజనీర్లుగా.. వివిధ స్థాయిల్లో కేరళ వాసులు యూఏఈలో పనిచేస్తున్నారు. ఎన్నో దశాబ్ధాల అనుబంధం ఉన్న కేరళ రాష్ట్రం.. జల విలయంలో చిక్కుకోవడంతో దుబాయి రాజు స్పందించారు. కేరళకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు.