Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంతిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు దాదాపు 300 మందికిపైగా మృత్యువాతపడ్డారు. సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా కేరళ బాధితుల కోసం తమకు తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున, ప్రభాస్‌, తారక్‌, కల్యాణ్‌ రామ్‌, మహేశ్‌బాబు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.

నాగార్జున రూ.28 లక్షలు, ప్రభాస్‌ రూ.25 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.25 లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు, విక్రమ్‌ రూ.35 లక్షలు, మహేశ్‌బాబు రూ.25 లక్షలు విరాళాలు అందించారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కేరళ బాధితుల కోసం నేను, అమల మా వంతు సాయం చేశాం. మీరూ తోచిన సాయం చేయండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ..‘కేరళ వరద బాధితులకు సాయం చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇతర సహాయక బృందానికి సెల్యూట్‌’ అని పేర్కొన్నారు.