Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శాస్త్రవేత్తలు కరివేపాకు గురించి పలు పరిశోధనలు, అధ్యయనాలు చేసి మఽధుమేహాన్ని అదుపు చేసే గుణం ఈ ఆకుకు ఉందని తేల్చారు. కరివేపాకులో ఉండే ఒక పదార్థం మధుమేహుల్లో స్టార్చ్‌ గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ను నెమ్మదించేలా చేస్తుందని శాస్త్రవ్తేలు తెలుసుకున్నారు. కాబట్టి కరివేపాకును విరివిగా వాడాలని సూచిస్తున్నారు. అయితే కూరల్లో అందరం కరివేపాకు వాడుతూనే ఉంటాం. కానీ కరివేపాకునే నేరుగా వాడి తేనీరు తయారుచేసుకుంటే ఆ ఆకుల్లోని పోషకాలు మొత్తంగా అందుతాయి. ఆ పానీయం ఎలా తయారు చేయాలంటే?
గ్లాసుడు నీళ్లను మరిగించి, 30 కరివేపాకు ఆకులు వేయాలి.
ఆ నీళ్లను కొన్ని గంటలపాటు కదల్చకుండా ఉంచాలి.
తర్వాత నీటిని వడగట్టి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.