Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రత్యుపకారం చేసే స్తోమత లేని నిరుపేదలకు, దీనులకు, అభాగ్యులకు చేసే సాయమే భక్తులకు అత్యంత ఫలదాయకమని శాస్త్రాలు బోధించాయి. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం. ఉన్నవారికే విందు భోజనాలు పెట్టడమూ అంతే. నీళ్లు చెట్టుకు, చేనుకు పోయాలి లేదా గొంతెండి పోతున్న వారి దప్పిక తీర్చాలి. అదే దేవుడు మెచ్చే మంచి పని. లేనివారికి పచ్చడన్నం పెట్టినా పరమాన్నంతో సమానంగా భావిస్తాడు. ఇందుకో చిన్న ఉదాహరణ చూద్దాం… ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులను ఆహ్వానించాడు.

అయితే వాళ్లంతా కూడబలుక్కొని ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. అందుకతను నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన సేవకులను పురమాయించాడు. వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. అయినా ఇంకా స్థలముంటే, భిక్షగాళ్లను, కూలీలను పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల కడుపులూ నిండాయి. ధనికుని హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది.