Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మరో రెండు రోజుల్లో కృష్ణాష్టమి! పిల్లలను ముచ్చటైన దుస్తుల్లో ముస్తాబు చేయడమే ఈ పండగకున్న ప్రత్యేకత! మరి మరోసారి సంప్రదాయ కట్టూబొట్టులో చిన్నారుల్ని సింగారించి మురిసిపోదామా…

ఎంకి పాటే కాదు, రూపమూ రమ్యమే! కోక, రవిక…. వాటికి తగిన కొప్పు కట్టేసి ఎంకిని తలపించేలా ఆడపిల్లలను తయారు చేయొచ్చు! పిల్లలు కొంటెగా కనిపించాలంటే, ఈ డ్రస్‌ వేయాల్సిందే!

పండగ శోభ వెల్లివిరియాలంటే సంప్రదాయ దుస్తులే ధరించాలి. కాబట్టి మీ అబ్బాయికి ఎప్పుడూ కొనే జీన్స్‌, టీషర్ట్‌లను పక్కనపెట్టి, లాల్చీ పైజామా కొనేయండి! ఆ డ్రస్‌లో ఎంత ముద్దులొలుకుతారో మగ పిల్లలు!

చీరకట్టు పెద్దలకేనా? మాకెందుకు వద్దు? అని మొండికేసే చిట్టి తల్లులకు రెడీమేడ్‌ చీర డ్రస్‌ ఉండనే ఉంది. చీర చుడితే ముద్దు పాపాయిలు, కృష్ణుడి వెంటపడే గోపికలను మరిపిస్తారు!

ధోతీ కడితే పెద్దలైనా, పిల్లలైనా చినరాయుళ్లే! తెల్లని కాటన్‌ ధోతీకి, కిర్రుకిర్రుమనే బూట్లు చక్కని మ్యాచింగ్‌! ఈ డ్రస్‌లో మీ చిన్ని కృష్ణుల్ని అలంకరించి మురిసిపోండి!

పండగల్లో అమ్మాయిలకు దీటుగా అబ్బాయిలు మెరిసిపోవాలంటే షేర్వాణీ డ్రస్‌ వేయాలి. ఆకర్షణీయమైన డిజైన్లు, రంగుల్లో దొరికే ఈ డ్రస్‌కు మ్యాచ్‌ అయ్యే విధంగా కొల్హాపురి బూట్లూ వేయాలి