Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ డాన్స్‌ ఇరగతీశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్‌ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 12 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అశ్విన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు.

మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో పంజాబ్‌ ఆటగాళ్లు మైదానంలో నటుడు సోనూ సూద్‌తో కలిసి సందడి చేశారు. డ్రమ్స్‌ వాయిస్తూ డాన్స్‌లు చేశారు. వీరితో పాటు అశ్విన్‌ కూడా పాదం కలిపాడు. ఈ వీడియోను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఆటతోనే కాదు డాన్స్‌తోనూ అభిమానులను అశ్విన్‌ అలరిస్తున్నాడు.