Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ద్వారా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్‌ మి 3 ప్రో ను ఇవాళ (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అంచనాలకు కనుగుణంగానే రూ. 13,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌నున లాంచ్‌ చేసింది. పబ్‌జీ లాంటి గేమింగ్‌, వూక్‌3.0 ఫ్లాష్‌ చార్జ్‌, అద్భుతమైన సోనీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. 29, ఏప్రిల్‌ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి. కామ్‌ ద్వారా అందుబాటులో ఉండనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా వెయ్యిరూపాయల డిస్కౌంట్‌ లభ్యం.

రియల్‌ మి 3 ప్రో ఫీచర్లు
6.30అంగుళాల డిస్‌స్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0
4జీబీ/6జీబీ ర్యామ్‌, 64/128 జీబీస్టోరేజ్‌
25 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ అల్ట్రాహెచ్‌డీ మోడ్‌
16+5 ఎంపీ రియర్‌ కెమెరా
4045 ఎంఏహెచ్‌ బ్యాటరీ

4జీబీ ర్యామ్‌, 32 జీబీస్టోరేజ్‌ రూ.13999
6జీబీ ర్యామ్‌ 128 జీబీస్టోరేజ్‌ ధర రూ. 16,999
దీంతో పాటో రియల్‌మి సీ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఒప్పో లాంచ్‌ చేసింది. రూ. 5999 ధరలో ఇది లభ్యం.