Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆసియా ఖండంలోనే అత్యాధునిక రవాణా వ్యవస్థ కలిగిన చైనాలో ఊహించని రీతిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బీజింగ్‌- కున్‌మింగ్‌ నగరాలను కలిపే ఎనిమిదిలేన్ల హైవేపై 56 కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్న ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. అక్కడి ప్రభుత్వ వార్తా సంస్థల కథనం ప్రకారం..

ఈశాన్య చైనాలోని షాంగ్జీ ఫ్రావిన్స్‌ గుండా వెళ్లే బీజింగ్‌- కున్‌మింగ్‌ హైవేపై సోమవారం ఉదయం ఈ పెనుప్రమాదం సంభవించింది. అప్పటికే కొద్ది గంటలుగా మంచు కురుస్తుండటంతో రోడ్డుపై ప్రయాణించిన వాహనాలు పట్టుకోల్పోయి రైలింగ్‌ ను ఢీకొట్టాయని, ఆ సమయంలో పొగమంచు కూడా కమ్మి ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేక మొత్తం 56 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 37 మంది గాయపడ్డారని తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. భారీ క్రేన్ల సాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించారు. ప్రమాదం కారణంగా  బీజింగ్‌- కున్‌మింగ్‌ హైవేను పూర్తిగా మూసేశారు. మంగళవారం నాటికి కూడా ఆ మార్గాన్ని పునరుద్ధరించలేదు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.