Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నెలసరి రోజుల్లో రోజుకొక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే నీరసం, అలసట ఉండవు. ఆహారంలో బి విటమిన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు డాక్టరు సలహా మేరకు అవన్నీ అందే విధంగా మందులు వాడితే కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. రుతుక్రమం బాధ తీవ్రత తగ్గుతుంది.

శరీరంలో క్యాల్షియం తగినంత ఉన్నప్పుడు ఈ సమయంలో నొప్పులు కలగవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలు రోజుకు 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రుతుక్రమం రోజుల్లోనే కాకుండా ప్రతిరోజూ మూడుకప్పుల పాలు తాగాలి.