Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పడిశం, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గాలంటే టీ మరిగేటప్పుడు చిన్న అల్లం ముక్కను చితక్కొట్టి వేసి కనీసం ఒక నిముషం మరిగించి తాగితే ఉపశమనం ఉంటుంది. ఈ టీని రోజుకు రెండుసార్లు తాగవచ్చు. పడిశానికి తోడు సైనస్ సమస్య బాధిస్తుంటే అర లీటరు నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టాలి.

ఉదయం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చేస్తే పడిశం త్వరగా తగ్గుతుంది. గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు- మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.