Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎసిడిటీ, అజీర్తితో బాధపడేవారు పరగడుపున టీ స్పూన్ అల్లం రసంలో ఐదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకుంటుంటే ఎసిడిటీ, అజీర్తి తగ్గుతాయి.కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లవంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది.

ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉసిరి పొడి కలుపుకొని ప్రతిరోజూ తీసుకుంటే ఎసిడిటీ సమస్య క్రమంగా తగ్గుతుంది.చలికాలంలో తరచుగా జలుబు వేధిస్తుంటుంది. జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా రెండు రోజులు చేస్తే ఉపశమనం ఉంటుంది.