Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల అయితే చాలు నందమూరి అభిమానుల హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. బాలకృష్ణ ఒకసారి కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంటే మిగిలిన విషయాల గురించి అసలు పట్టించుకోరని, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారని ఆయనతో సినిమా చేసిన వాళ్ళు అందరూ చెప్తారు. దర్శకుడు వీవీ వినాయక్ బాలకృష్ణ హీరోగా ‘చెన్నకేశవరెడ్డి’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన ఒక సంగతిని వినాయక్ అప్పట్లోనే రాజమౌళితో పంచుకున్నాడంట. ఆ విషయాన్నీ రాజమౌళి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని మొదలుపెట్టారు. రిలీజ్ డేట్ దగ్గర పడిపోయినా  షూటింగ్ మాత్రం మిగిలిపోయింది. దీంతో దర్శకుడు వినాయక్ ముందు సినిమా విడుదల చేసి తరువాత పాటను యాడ్ చేద్దామనుకున్నారు. తీరా సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వినాయక్ నీరసించిపోయారు. ఈ విషయాన్నీ గమనించిన బాలకృష్ణ వినాయక్ ను ‘నువ్వు 100 శాతం కష్టపడ్డావు కదా’ అని అడిగారంట. దానికి వినాయక్ అవునని సమాధానం చెప్తే దానికి బాలకృష్ణ అయితే బాధ ఇంక బాధ పడకు. నీ పని విషయంలో నేను కూడా సంతృప్తిగానే ఉన్నాను. ఎంత కష్టపడినా ఫలితం మన చేతుల్లో ఉండదని అన్నారంట. అంతేకాదు మంచి కథతో వస్తే మళ్ళీ వినాయక్ తో సినిమా చేస్తానని కూడా హామీ ఇచ్చారంట. ఈ విషయాన్ని చాలా భావోద్వేగంతో వినాయక్ నాకు చెప్పాడని రాజమౌళి అన్నాడు.