Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇప్పటివరకు భారతీయులను, మెక్సికన్లను,ముస్లింలను తిట్టిపోసిన ట్రంప్ ఉన్నట్టుండి అమెరికాలో ఉంటున్న భారతీయములపై ప్రేమకురిపిస్తున్నాడు. మాములుగా కాదండోయ్.. ప్రధాని నరేద్ర మోడీ స్టయిల్ ని ఫాలో అవుతున్నాడు.2014 ఎన్నిలకల్లో ప్రచారం లో నరేద్రమోడీ ” ఆప్ కీ బార్ మోడీ సర్కార్” అంటూ ప్రచారం చేశారు. ట్రంప్ కూడా ఇండో అమెరికన్లను ఆకట్టుకోవడం కోసం హిందీ లో మాట్లాడి ఆశ్చర్య పరుస్తున్నాడు.

ఎన్నికల ప్రచారం లో ట్రంప్ మాట్లాడుతూ ”ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్” అని మోడీ స్టైల్ లో హిందీ లో మాట్లాడి అందరినిఆశ్చర్య పరిచాడు. త్వరలో జరగనున్న దీపావళి ని పురస్కరించుకుని ట్రంప్ ఇండో అమెరికన్లకు శుభాకాంక్షలు తెలిపాడు. ఉన్నట్టుండి ఇంత ప్రేమ కురిపించదానికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉండడమే.ఇండో అమెరికన్ల మద్దత్తు లేకుండా ట్రంప్ గెలవడం కష్టం అనే అభిప్రాయం ఉంది.