Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నిత్యం రోగులతో రద్దీగా ఉండే గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ్యా రెడ్డి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఓపీ విభాగంలో రోగులకు అందుతున్న సేవలను గురించి వైద్య అధికారులను ఆరా తీశారు. అవినీతికి పాల్పడుతూ రోగుల దగ్గర డబ్బులు గుంజుతున్న కొందరు ఉద్యోగులపై మినిష్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ. వారిని విధుల నుండి తొలగిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ల సహాయంతో అక్కడే ఉన్న కొందరి రోగుల ఆరోగ్య పరిస్థితులను ఆయన తెలుసుకొని ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. అంతే కాకుండా కొందరి రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందా అని అడుగుతూ.డాక్టర్లు,నర్సులు సరైన సమయానికి స్పందిస్తున్నారా అని అడిగారు.అయితే వైద్యులు సరైన సమయానికి స్పందించడం లేదని కొందరు ఓపీ బ్లాక్ పేషంట్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దింతో హెల్త్ మినిష్టర్ కొందరి వైద్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. తరువాత హాస్పిటల్ అధికారులతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి పేషంట్ కి సరైన సమయానికి వైద్యం అందించాలన్నారు.