Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి మరీ పలువురు నేతలు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు.
తాజాగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ ఎంపీ  రానా మహ్మద్ అఫ్జల్ మాట్లాడుతూ.. జమాత్ ఉద్ దవా చీఫ్, లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ హఫీజ్ను పెంచి పోషిస్తున్నందుకు అతడు మనకు ఏమైనా గుడ్లు పెడుతున్నాడా?’ అంటూ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో అఫ్జల్ ప్రశ్నించారు.
భారత్లో ఉగ్రకార్యకలాపాల్లో హఫీజ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అతడిపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని అఫ్జల్ అన్నారు. విదేశీ వ్యవహారాల్లో పాకిస్తాన్ అవలంభిస్తున్న విధానాన్ని సైతం అఫ్జల్ ఎండగట్టారు. హఫీజ్ ఉగ్రవాది అనే విషయాన్ని భారత్ ప్రపంచవ్యాప్తంగా వెల్లడించిందని.. అలాంటి వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రవాదం విషయంలో చర్యలు తీసుకోవడం ద్వారా పాక్ను టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించి ఒంటరిని చేయాలన్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.