Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బెంగుళూరులోని ఓ కళాశాలలో ఆంగ్ల సబ్జెక్టు ని భోదించే ప్రొఫెసర్ బహిష్కరణకు గురయ్యాడు. అతడు స్వలింగ సంపర్కుడని ఆరోపిస్తూ కాలేజీ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది.అతనివల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటుందనే కారణంగా అతడిని యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు.

బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఆష్లే టెలీస్ అనేవ్యక్తి ఆంగ్ల విభాగం లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని విషయాల్లో అతడికి వింత అనుభవాలు ఉండేవి వాటిని విద్యార్థులపై రుద్దుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని విద్యార్థులకు భోదించకూడని విషయాలను వారిపై రుద్దుతున్నాదాని యాజమాన్యం ఆగ్రహించింది. మార్చి 9 న తాను బికాం విద్యార్థులకు పాఠం భోదిస్తుండగా ప్రిన్సిపాల్ నుంచి నాకు పిలుపు వచ్చింది.నీవు నీ సొంత అభిప్రయాలను విద్యార్థుల పై రుద్దు తున్నావు. దానివలన వారు డిస్ట్రబ్ అవుతున్నారు. వెంటనే రాజీనామాచేయి.. అంటూ ప్రిన్సిపాల్ తనని ఆదేశించారని అతడే స్వయంగా తెలిపాడు. విద్యార్థులు కొన్ని విషయాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని అతడు అన్నాడు. వాటి వలన వారు డిస్ట్రబ్ అయితే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత భోదకులదే అని అన్నారు. అలాంటి విషయాల గురించి వారు తెలుసుకోకుంటే ఎప్పుడు ఆలోచిస్తారు.. ఎప్పుడు ఈ ప్రపంచంలో మార్పు వస్తుంది ? అని బహిష్కరణకు గురైన టెలీస్ వాదించడం విశేషం.