Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టాటా చైర్మెన్ పదవి నుండి సైరస్ మిస్త్రీ ని తొలగించడం అనే వార్త దేశ వ్యాపార సంస్థలకు పెద్ద షాక్ నే ఇచ్చిందని చెప్పవచ్చు. రతన్ టాటా ఉన్న పళంగా సైరస్ మిస్త్రీ ని తొలగించడం వెనకాల పెద్ద కథే ఉందని వ్యాపార వర్గాలు కోడై కూస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం అయిన టాటా గ్రూపులో ఇలాంటి సంచలన వార్తలు వెలువడడం నిజంగా ఆశ్చర్య కరమే. ఇంతకీ రతన్ తాటాకు ఎందుకు తీసేసినట్టు…? దీని వెనకాల ఉన్న అసలు వాస్తవ ఏంటి…? తదుపరి చర్మెన్ పదవి యఎవారికి దక్కుతుంది..? ఈ ప్రశ్నలన్నీ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటి విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడం ఆయనపై వేటు వేయడానికి కారణాలుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.

2012, డిసెంబరు 29న రతన్‌ స్థానంలో మిస్త్రీ ఎంపిక సమయంలో అందరూ ఎంతలా ఆశ్చర్యపోయారో..సోమవారం నాటి ఉద్వాసన ప్రకటనతో అందరూ అదే స్థాయిలో ఆశ్చర్యపోయారు. ఐర్లాండ్ లో జన్మించిన సైరస్ మిస్త్రీ నలభై నాలుగు సంవత్సారాల వయసులో 2012 డిసెంబర్ లో టాటా సన్స్ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు. నిజానికి ఆయన ఎంపిక అప్పట్లో ఎవరూ ఊహించలేదు. స్వయంగా సైరస్ కూడా రతన్ వారసత్వ భాగ్యం తననే వర్తిస్తుందని తెలియదు.

సైరస్ తండ్రి గారైన ప్రముఖ పారిశ్రామిక వేత్త షాపుర్జీ పల్లోంజి టాటా సన్స్ లో అతిపెద్ద వాటాదారు. అందువల్ల 2006 నుంచే సైరస్ టాటా సన్స్ లో డైరెక్టర్ గా ఉంటూ వచ్చారు. రతన్ టాటా వారసును అన్వేషణ కోసం ఏర్పాటు అయిన ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి సెర్చ్ కమిటీలో సైరస్ కూడా సభ్యులే. కమిటీలోని ఇతర సభ్యుల బలమైన సిఫారసుతో 2011 నవంబర్ మిస్త్రీ ని తన వారసునిగా రతన్ టాటా ప్రకటించారు. మొదట డిప్యుటీ చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీ కి ఏడాది తర్వాత చర్మెన్ గా పగ్గాలు చేతికొచ్చాయి. నాలుగేళ్లు తిరగకుండానే ఆయన పదవీకాలం అర్థాంతరంగా ముగిసింది.

సైరస్ మిస్త్రీ స్థానంలో ఎవరిని నియమించాలని టాటా గ్రూపు సమాలోచనలు చేస్తుంది. అయితే ఈ మొత్తం కార్యక్రమానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చని చైర్మెన్ ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఛైర్మెన్ పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు. వారిలో పెప్సీ కో సీఈఓ ఇంద్రనూయి, ఒడాఫోన్ మాజీ సీఈఓ అరుణ్ షరీన్, టీసీఎస్ ఛైర్మెన్ ఎండీ చంద్రశేఖరన్, టాటా గ్రుపుకే చెందిన ఇషాంత్ ఉస్సేన్, ముత్తు రామన్ లు ఉన్నారు. బయటి వ్యక్తి కంటే తన కుటుంబంలో భాగమైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.