Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ రక్షణలో భాగంగా గాయపడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు పతకాలు ఇచ్చి సత్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ఓ పని అక్కడున్న అందరిని భావోద్వేగానికి గురి చేసింది. వైకల్యంతో బాధపడుతున్న వారందరిని గౌరవించడమే కాకుండా ఆప్యాయంగా పలకరించారు. 2014 జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన మినా గోద్రజ్‌ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతడి దవడలోకి ఓ బుల్లెట్ దూసుకుపోయింది. అప్పటినుండి అతను సరిగ్గా మాట్లాడలేడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ నాథ్ ఆ జవానును దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా హోమ్ మంత్రి ప్రోటో కాల్ ను దృష్టిలో పెట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందిస్తారు. కానీ రాజ్ నాథ్ ఆ నియమాలను ఏమి పట్టించుకోకుండా ఆ సైనికున్ని ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఆయన భావోద్వేగానికి లోనయ్యారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.