Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో ఓ సరికొత్త కథాంశంతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘గ్యాంబ్లర్'(మంగాత్తా), ‘బిర్యాని’ సినిమాల ద్వారా దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటివరకూ రిలీజ్ ఈరోజు, ఆరోజు అంటూ వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదలకు ఫైనల్‌గా ఓ డేట్ ఫిక్స్ చేశారు

ప్రప్రంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో మే 29న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుందన్న విషయాన్ని సూర్య కన్‌ఫర్మ్ చేశాడు. ఈ సినిమా ఆడియో నిన్నే నేరుగా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇక నిన్న సాయంత్రం సూర్య హైద్రాబాద్‌లో రాక్షసుడు ఫస్ట్‌లుక్, టీజర్‌లను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యతో పాటు దర్శకుడు వెంకట్ ప్రభు, సినిమా యూనిట్ పాల్గొన్నారు.తెలుగు టీజర్‌కు కూడా తమిళ టీజర్‌కు వచ్చినట్టుగానే మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా డబ్బింగ్‌ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య ఆత్మగా కనిపించి భయపెడతాడని సమాచారం. సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు.