Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తలాక్ అంశంపై శుక్రవారం రాజ్యాంగ బద్దంగా సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన తొలి రోజే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్ విధానం అనుచితం, అవాంఛనీయం అని పేర్కొంది. ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ మాట్లాడుతూ తలాక్ విధానం లో ముస్లిం పురుషలకు ఉన్నట్లుగా, స్త్రీలకూ హక్కులు లేవని తన వాదానిని వినిపించారు. ముస్లిం మాత్రం తలాక్ విధానం చట్టపరమైనదే అని పేర్కొంటోంది. ఇరు వర్గాలు సుప్రీం ముందు తమ వాదనని వినిపించాయి.

ఈ చారిత్రాత్మకమైన అంశంపై సుప్రీం ఆరు రోజుల పాటు విచారణ కొనసాగించనుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ తోపాటు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు నేడు విచారణ సాగింది. ఇస్లాం ప్రకారం విడాకులు తీసుకోవాలనుకుంటే మూడుసార్లు తలాక్ చెబితే సరిపోతుంది. ఈ విధానం ఇటీవల కాలంలో మితిమీరి పోవడంతో దీనిపై చర్చ సాగుతోంది. కొందరు వాట్సాప్ లలో కూడా భార్యలకు తలాక్ చెబుతున్నారు.తోలి రోజే సుప్రీం దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో సంచలనతీర్పు సిద్దమవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.