Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సునీల్…కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్ తెచ్చుకుని ఆ తరువాత హీరోగా మారి ఈ రెండు మూడు సూపర్ హిట్ సినిమాల తరువాత సునీల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘జక్కన్న’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా సునీల్ కు మంచి కమర్షియల్ విజయాన్ని అందిస్తుందని అనుకున్నారు కానీ అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో 12 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ఈ సినిమా ముందు ముందు కూడా పెద్దగా వసూళ్లు ఉండక పోవచ్చు. దాంతో సునీల్ సినిమాకు పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిసిపోతుంది. మొత్తానికి ‘జక్కన్న’ ను సేవ్ చేయాలంటే ఇక శాటిలైట్ రైట్స్ హక్కులే దిక్కయ్యేలా ఉన్నాయి. సునీల్ సినిమాల‌ సాటిలైట్ రైట్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ లెక్కన్న సునీల్ ‘జక్కన్న’ సినిమాకు రెండు మూడు కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నటు తెలుస్తోంది. మరి సునీల్ ఫేట్ ను శాటిలైట్ రైట్స్ అయినా మారుస్తాయేమో చూడాలి.