Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వ్యాయామంతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిల్లలు కూడా వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. ఆట్లాడుకోవడంతో పాటు వ్యాయామం చేసే పిల్లల్లో
* దృఢమైన కండరాలు, ఎముకల పెరుగుదల, కీళ్ళు బలపడతాయి.
* వ్యాయామంతో ఆక్సిజన్ అధికంగా పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి.
* గుండె పదిలం అవుతుంది.
* రక్త ప్రసరణ సక్రమం అవుతుంది.
* బాగా ఆకలేయడం.. తద్వారా సరైన సమయంలో ఆహారం తీసుకోవడం జరుగుతుంది.
* శరీరంలోని అన్ని భాగాలూ సక్రమంగా పనిచేస్తాయి.
* అందరితో కలిసి ఆట్లాడుకోవడం ద్వారా మానవీయ విలువలు పెరుగుతాయి.
* జాతి, మత భేదాలు లేని స్నేహం ఏర్పడుతుంది.
* అభివృద్ధికి తగిన మానసిక వికాసం కలుగుతుంది.
* మనస్సు, శరీరాన్ని వ్యాయామం, క్రీడల ద్వారా స్థిరంగా ఉంచుకోవడం ద్వారా దురలవాట్లను దూరం చేసుకోవచ్చు.
* శుభ్రతతో పాటు మంచి ప్రవర్తన అలవడుతుంది.
* ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది.
* సంతోషం చేకూరుతుంది.
* దేశభక్తి, ఇతరులకు సాయపడే గుణం పెరుగుతుంది.
వ్యాయామంతో ఏర్పడే మరో 5 ప్రయోజనాలు..
1. శరీరం పెరగడంతో పాటు మానసికంగా వృద్ధి చెందడం ద్వారా చదువుపై సులభంగా శ్రద్ధ చూపుతారు.
2. కచ్చితమైన, నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు.
3. వ్యాయామం గుండెను పదిలం చేస్తుంది. మెదడును చురుగ్గా పనిచేయిస్తుంది.
4. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
5. మానసిక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతుంది.