Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గత ఒలంపిక్స్ లో సైనా నెహ్వాల్ పతకం తో మెరువగా, తాజా గా జరుగుతున్నా రియో ఒలంపిక్స్ లో తెలుగు తేజం సింధు వెండి వెలుగులను విరజిమ్మింది.వీరిద్దరి విజయం వెనుక కోచ్ గోపిచంద్ కృషి ఎంతైనా ఉంది.బ్యాట్మింటన్ క్రీడాకారుడిగా అనేక విజయాలు సాధించిన గోపిచంద్.. రెండో ఇన్నింగ్స్ గా అకాడమీని స్థాపించి అనేక మంది షట్లర్లను తీర్చిదిద్దుతున్నారు.

కాగా గోపీచంద్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్క బోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం లో సుధీర్ బాబు గోపీచంద్ పాత్రలో నటించనున్నాడు. దీనికి సంభదించిన వర్క్ 18 నెలల నుంచి జరుగుతోందని ,నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుందని సుదీర్ బాబు తెలిపాడు.