Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లలు ఎక్కడవున్నా అక్కడ సందడి ఉంటుంది. ఆటలతో హడావిడీ ఉంటుంది. రానురాను సంప్రదాయ ఆటలని అటకెక్కించిన పిల్లలు వీడియోగేమ్స్‌కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువ సమయం వీడియోగేమ్స్‌ ఆడే పిల్లలు చురుకుదనంలో కేక పుట్టిస్తారని ఓ పరిశోధనలో తేలింది.

ప్రతీ రోజూ మూడు గంటలపాటు వీడియోగేమ్స్‌ ఆడితే ఖచ్చితంగా పిల్లలు భలే చురుకుగా ఉంటారని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తాజా పనిశోధనలో తేలింది. సైకాలజీ ఆఫ్‌ మీడియా కల్చర్‌ ఈ విషయాన్ని ఇటీవలే ప్రచురించింది. పిల్లలు అకడమిక్‌ పర్ఫార్మెన్స్‌, వైలెంట్‌ గేమ్స్‌ ఆడటం, అగ్రెసివ్‌ బిహేవియర్‌కి ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో పాటు గంటలోపు వీడియోగేమ్స్‌ ఆడేవాళ్ళ ప్రవర్తన బావుంటుందనీ, హైపర్‌యాక్టివ్‌ శాతం తగ్గుతుందని కూడా శాస్త్రవేత్తలు తెలియ జేశారు.

ప్రతీరోజు ఎన్ని రకాల వీడియో గేమ్స్‌ ఆడతారు, ఎంత సమయం ఆ గేమ్స్‌ ఆడతారో తెల్సుకునేందుకు, 12 సంవత్సరాలుండే 200 మంది విద్యార్థుల్ని సర్వే చేశారు పరిశోధకులు. రేసింగ్‌, పజిల్స్‌, ఆఫ్‌ లైన్‌ కాంపిటీటివ్‌ వీడియో గేమ్స్‌, ఆన్‌లైన్‌ కాంపిటీటివ్‌ వీడియో గేమ్స్‌, యుద్ధవ్యూహాలుండే గేమ్స్‌, రేసింగ్‌, స్పోర్గ్‌ గేమ్స్‌ ఆడతామని విద్యార్థులు తెలియజేశారు. ఎలాంటి గేమ్స్‌ ఆడేటపుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో తెల్సుకోమని ఈ పరిశోధకులు పేరెంట్స్‌కి సలహా ఇచ్చారు. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు పజిల్స్‌ ఆడితే స్కూల్‌లో అందరికంటే ముందు ఉంటారని భావిస్తున్నారు. అయితే అలాంటి వారు మామూలు వీడియోగేమ్స్‌ ఆడేవారికంటే వెనకబడ్డారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.