Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అబ్బాస్… అప్పట్లో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో. ”ముస్తఫా .. ముస్తఫా” సాంగ్ తో దేశాన్నే ఓ ఊపు ఊపేసాడు. కథిర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్. ఒక్కసారిగా ఆ సినిమాతో అమ్మయిల కలల రాకుమారుడిగా మారాడు. ఇక ఆ సినిమా తరువాత మనోడికి చాలా అవకాశాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ కు పెద్దగా బ్రేక్ రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసాడు.

తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించిన అబ్బాస్ కు ప్రస్తుతం సినిమాలు లేవు కాబట్టి ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుతం హార్పిక్ అంటూ టాయిలెట్ క్లీన్ యాడ్ తో రోజు కనిపిస్తూనే ఉన్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పడూ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడట !! తమిళ, మలయాళంలో రూపొందే ఓ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అబ్బాస్. ఇందులో అబ్బాస్ పాత్ర చాలా క్రూయల్ గా ఉంటుందట. మొత్తానికి రీ ఎంట్రీ తో తన సత్తా చాటుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు అబ్బాస్.