Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారుతున్నాయి. చైనాలోని ఒక వ్యక్తి భార్య తన భార్య నుండి విడాకులు కోరాడు. ఆమె కూడా అందుకు సమ్మతించింది. అయితే విడాకులు ఇవ్వడానికి తనకు ఒక కారు కొనిపెట్టాలని కండిషన్ పెట్టింది. కారు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన బిడ్డను అమ్మకానికి పెట్టాడు.

చైనాలోని లింగ్వి పట్టణానికి చెందిన జాంగ్ అనే వ్యక్తి కొన్ని కారణాల వల్ల తన భార్య నుండి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. అందుకు అతని భార్య కూడా అంగీకరించి ఒక షరతు విధించింది. తాను విడాకులు ఇవ్వాలంటే తనకు కారు కొనిపెట్టాలని కండిషన్ పెట్టింది. కారు కోనేటంత డబ్బు జాంగ్ దగ్గర లేదు. కానీ ఎలా అయినా తన భార్య నుండి విడాకులు పొందాలనుకునే తన ఐదు నెలల కుమారుడిని అమ్మకానికి పెట్టాడు. ఆన్ లైన్ లో పరిచయం అయిన ఒక వ్యక్తికి 80 వేల యువాన్లకు బేరం కుదుర్చుకున్నాడు. కుమారుడిని అతనికి అప్పగించి డబ్బు తీసుకునేందుకు జాంగ్ ఒక కూడలి వద్ద నిల్చున్నాడు. చిన్నారి ఒంటిపై సరైన దుస్తులు లేవు. చలి ఎక్కువగా ఉంది. దాంతో పది నిముషాల తరువాత ఆ పిల్లాడు ఏడవడం మొదలెట్టాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటువైపు వచ్చారు. జాంగ్ కదలికలు అనుమానంగా కనపడడంతో స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దాంతో భార్యకు కారు కొనడానికి ఇలా చేసానని, అంతేకాకుండా తాము విడాకులు తీసుకుంటే తమ బిడ్డకు తల్లితండ్రులు ఉంటారనే ఉద్దేశంతోనే ఇలా చేశానని జాంగ్ చెప్పాడు. పోలీసులు జాంగ్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.