Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇరవై నాలుగేళ్ల క్రితం …
9 మే 1990… చిరంజీవి జీవితంలో అదొక మరపురాని రోజు!
కారణం, ఆయన కెరీర్లో ఓ ఆణిముత్యంలా నిలిచిపోయిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రం విడుదలై, భీకరమైన తుపానును సైతం ఛేదించి కాసుల వర్షం కురిపించింది!
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఆహ్వానంపై ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు నిన్న సాయంత్రం చిరంజీవి ఇంటికి వచ్చారు.
ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ ఆ సాయంకాలాన్ని వారు ఆనందంగా ఆస్వాదించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ కూడా వీరితో జత కలిశాడు.
వారిద్దరూ నాటి ముచ్చట్లు చెబుతుంటే … వాటిని వింటూ తను కూడా ఎంతగానో ఎంజాయ్ చేశాడు.
ఈ సందర్భంగా వారితో కలసి దిగిన ఫోటోను చరణ్ ట్విట్టెర్లో పోస్ట్ చేస్తూ, “ఇరవై నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ వెండితెరపై మేజిక్ క్రియేట్ చేశారు.
వారిద్దరితోనూ ఈ సాయంకాలాన్ని మా ఇంటి వద్ద గడిపినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి… వారిద్దరికీ కంగ్రాట్స్…” అంటూ కామెంట్ కూడా పెట్టాడు.