Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మరో రెండేళ్ళల్లో ఎన్నికలు రానున్నాయి. అయితే మారుతున్న సమీకరణాల నేపధ్యంలో, ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న కోపం, హామీలు అమలు చేయడంలో వైఫల్యం అన్ని కలిసి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈ సారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు వున్నాయని తెలుగు రాష్ట్రంలో ఓ సర్వే రీసెంట్ గా తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎన్ని విధాలుగా మారిన, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసిన అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, పవన్ కళ్యాణ్ కి కాస్త ఓటు బ్యాంకు చేరుతుందే తప్ప పూర్తిగా జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభావం చూపించే అవకాశాలు లేవని ఆ నివేదికలో పేర్కొంది. వైసీపీ సింగిల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వైఎస్ మీద వున్న సానుభూతి, చంద్రబాబు పరిపాలన మీద వున్న వ్యతిరేకత ఇప్పుడు జగన్ కి లాభం చేకూరుస్తుందని ఆ నివేదిక పేర్కొంది. పరిపాలనలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు కాని అధికార మార్పిడి మాత్రం రాష్ట్రంలో గ్యారెంటీ అని ఆ నివేదికలో చెప్పింది. ఇదే నివేదిక ఆధారంగా ఇప్పుడు వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే దీమాతో ఆ పార్టీ నాయకులు వున్నట్లు, అందుకే వారు వెళ్ళిన ప్రతి చోట, మా ప్రభుత్వ హయాంలో అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గట్టిగా ప్రకటనలు ఇస్తున్నారని తెలుస్తుంది. అలాగే నాయకులు అలా మాట్లాడటం ద్వారా, ప్రజల్లో కూడా ఓ సానుకూల వాతావరణాన్ని, వైసీపీని గెలిపించాలనే ఆలోచనని సృష్టిస్తుందని వైసీపీ నమ్ముతున్నట్లు తెలుస్తుంది. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా వైసీపీ గెలుపులో భాగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.