Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కాలేజ్ స్టూడెంట్స్ పెడ‌పోక‌డ‌లు పోయిన అరుదైన సందర్భ‌మిది. ఇంజినీరింగ్ చ‌దువుతున్న న‌లుగురు విద్యార్థులు దొంగ‌నోట్లు ముద్రిస్తూ పోలీసుల‌కు చిక్కారు. న‌గ‌రంలో సంచ‌ల‌నం రేకెత్తించిన ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ హిమాయ‌త్ సాగ‌ర్ ప‌రిస‌రాల్లోని లార్డ్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జ‌రిగింది. స‌ద‌రు విద్యార్థుల నుంచి ప్రింటింగ్ మిష‌న్‌, దొంగ 2 వేల నోట్లు, కొన్ని సెల్‌ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌పై రాజేంద్ర‌న‌గ‌ర్ పీఎస్‌లో కేసు పెట్టి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈజీ మ‌నీ ఎల్ల‌పుడూ ఆక‌ర్షించేదే. అందుకు విద్యార్థులు ఆక‌ర్షితులు కావ‌డం ఇలా దొంగ‌నోట్లు ముద్రించి దొరికిపోవ‌డం ప్ర‌స్తుతం న‌గ‌రంలో టాక్ ఆప్ ది టౌన్ అయ్యింది. విద్యాల‌యాల‌కు చ‌దువుకోమ‌ని పంపిస్తే ఇలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌తారు. సిమీ, ఐసిస్ వంటి న‌ర‌హంత‌క ఉగ్ర‌వాదుల‌కు సానుభూతిప‌రులుగా విద్యార్థులు మారుతున్న వైనం బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు భ‌యం క‌లిగిస్తోందంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.