Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో ఘనవిజయం కొందరు భారత క్రికెటర్లకు కాసుల వర్షం కురిపించనుంది. ఇప్పటివరకు పెద్దగా వాణిజ్య ప్రకటనలకు నోచుకోని ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే, మురళీ విజయ్ ల బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇషాంత్ శర్మ వాణిజ్య ఒప్పందాలను 2011 వరకు పర్యవేక్షించిన కొల్లాజ్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ డైరక్టర్ లతిఖా ఖనేజా మాట్లాడుతూ, ఈ ఢిల్లీ బౌలర్ బ్రాండ్ వాల్యూ 30 శాతం మేర పెరగవచ్చని తెలిపారు.

ఓ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఇషాంత్ ఇప్పటివరకు ఏడాదికి రూ.40 లక్షలు తీసుకుంటుండగా, లార్డ్స్ విజయం నేపథ్యంలో అది రూ.52 లక్షల దాకా పెరగొచ్చని అంచనా. త్వరలోనే ఇషాంత్ అడిడాస్ తోనూ ఒప్పందం కుదుర్చుకుంటాడని ప్రస్తుతం అతనికి బ్రాండ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న అనీష్ గౌతమ్ పేర్కొన్నారు.

ఇక, విజయ్, రహానేల మార్కెట్ విలువ 10 నుంచి 15 శాతం పెరగనున్నట్టు గౌతమ్ భావిస్తున్నారు. గత కొన్ని నెలల్లోనే శిఖర్ ధావన్ 12 బ్రాండ్లు చేజక్కించుకోగా, రోహిత్ శర్మకు 8 బ్రాండ్లు దక్కాయని ఆయన వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ముఖాలకు గిరాకీ ఎక్కువగా ఉందని అన్నారు.